నివాళులర్పించిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు సాంబరెడ్డి
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం నాగారం గ్రామంలో అకాల మరణం చెందిన రామంచ ఓదెలు పార్థివ దేహానికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు చింతి రెడ్డి సాంబరెడ్డి నివాళులర్పించారు. శనివారం రోజు నాగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో రామంచ ఓదెలు అకాల మరణం చెందగా విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి ఓదేలు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు కార్తీక్, కావ్య మధుకర్, పల్లేర్ల సాగర్, జాలిగపు సంకీర్తన రాజు నాయకులు సుధాకర్, కుమార్, సంపత్, రాజశేఖర్, రమేష్,క్రాంతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
