Bomb threat | నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

Bomb threat | నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు
Bomb threat | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి కోర్టు సముదాయానికి బాంబు బెదిరింపు (Bomb threat) వచ్చిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బెదిరింపు సమాచారంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కోర్టు సముదాయాన్ని శోధించారు. అనంతరం కోర్టులో ఉన్న సిబ్బందిని, న్యాయవాదులను బయటకు పంపారు. అనంతరం వెంటనే భద్రతను కట్టుదిట్టం చేసి, ముందస్తు జాగ్రత్తగా కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), డాగ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టులోని ప్రతి గదిని, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను అణువణువూ తనిఖీ చేస్తున్నారు.
