Naga Vamsi | సిద్దు ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?
Naga Vamsi | సిద్దు ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?
Naga Vamsi | స్టార్ హీరో కోసం రాసిన కథ మారిన దారి
చరణ్ సూచనతో అఖిల్ వద్దకు వెళ్లిన ప్రాజెక్ట్
‘ఏజెంట్’ ప్రభావం.. ఆగిపోయిన సినిమా
సిద్దు జొన్నలగడ్డతో కొత్తగా ప్రారంభమైన ‘ధీర’
కొత్త దర్శకుడు అనిల్ కుమార్‌కు ఇదే ఛాన్స్?
Naga Vamsi | ఆంధ్రప్రభ వెడ్ డెస్క్ : ఒకరి కోసం కథ రాయడం.. మరొకరితో సెట్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో జరుగుతుంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటిదే జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ హీరోకి కథ చెబితే.. వేరే హీరోకి చెప్పమన్నారట. స్టార్ హీరో చెప్పినట్టుగా వేరే హీరోకి చెబితే చేస్తానన్నాడట. అయితే.. ప్రాజెక్ట్ సెట్ అయ్యిందని సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేసినా ముందుకు వెళ్లడం లేదట. దీంతో.. ఇప్పుడు ఆ డైరెక్టర్ సిద్దుతో సినిమా చేస్తున్నాడని తెలిసింది. ఆ ఇద్దరు హీరోలు ఎవరు..? ఆ డైరెక్టర్ ఎవరు..? ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?
Naga Vamsi | చరణ్, అఖిల్..

సాహో, ఓజీ సినిమాలకు వర్క్ చేసిన అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు రామ్ చరణ్ కి కథ చెబితే.. ఈ కథ తనకన్నా.. అఖిల్ కి బాగుంటుందని.. అఖిల్ కి చెప్పమన్నాడట. అఖిల్ కి కథ చెబితే.. బాగుంది చేస్తానని మాట ఇచ్చాడట. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ నిర్మించాలి అనుకుంది. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ ఈ సినిమా చేయాలి అనుకున్నాడట. దీనికి ధీర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. సోషియో ఫాంటసీ నేపధ్యంతో సాగే కథ పై అనిల్ కుమార్ చాన్నాళ్లు కసరత్తు చేశాడు. అయితే.. ఏజెంట్ డిజాస్టర్ అవ్వడంతో.. అఖిల్ చాన్నాళ్లు కొత్త సినిమా పై ఫోకస్ పెట్టలేదు.
Naga Vamsi | ధీర.. మెప్పించేనా..?

ఏజెంట్ బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా.. ఈ సినిమా చేస్తాడని అనిల్ కుమార్ వెయిట్ చేశాడు. అయితే.. ఏజెంట్ తర్వాత అఖిల్ లెనిన్ అనే డిపరెంట్ లవ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎప్పటి నుంచో ధీర కథ పై వర్క్ చేసిన అనిల్ కుమార్ మరో హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు ఆ కథే సిద్దు జొన్నలగడ్డకు చెబితే.. ఓకే చెప్పాడట. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఉగాది సందర్భంగా ప్రారంభించారు. ఇలా చరణ్ కోసం కథ రాస్తే.. అఖిల్ దగ్గరకి వెళ్ళింది. ఫైనల్ గా సిద్దు జొన్నలగడ్డతో ఫిక్స్ అయ్యింది. మరి.. ఈ కథను నమ్ముకున్న కొత్త దర్శకుడు అనిల్ కుమార్.. ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

