ఎస్బీ అగ్రి వర్సిటీకి మెయిల్
రంగంలో రూరల్ పోలీసులు
క్లూస్ టీంతో విస్తృత తనిఖీలు
ఇదంతా ఉత్తుత్తి బెదిరింపే..
సీఐ చిన్న గోవింద్ వెల్లడి
తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : ఎస్ వీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీ పేలుడు సంభవించబోతోందని, మానవ బాంబులతో ఉగ్రవాదులు దాడికి దిగనున్నారని ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు మెయిల్ పంపించగా.. తిరుపతిలో అలజడి రేగింది. గురువారం స్వాతిబిలాల్ మాలిక్ పేరిట ఎస్ వీ అగ్రికల్చర్ వర్సిటీ అధికారిక మెయిల్ బెదిరింపు లేఖ చేరింది. చిత్రకళ గోపాల్ ఘటన, సికిందర్ దర్గా ఘటన సూసైడ్ హ్యూమన్ ఐఈడీల తయారీ తదితర అంశాలను ఈ మెయిల్ లో ప్రస్తావించారు. అదనంగా టీ డబ్ల్యూ ఇన్ డ్ పైప్స్ ఐఈడీ బ్లాస్ట్, అనే బాలుడిని మానవ బాంబుగా సంకేతాలు పంపించారు.
తక్షణమే వర్సటీ అధికారులకు పోలీసులకు సమాచారం అందించటంతో వెంటనే డాగ్స్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ యూనివర్సిటీ కి చేరుకున్నాయి. పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం లేదని, ఇదొక ఆకతాయిల పని అని సీఐ చిన్న గోవింద్ తెలిపారు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామన్నారు. ఈ మెయిల్ మూలం ఉద్దేశం, తో పాటు సంబంధిత వ్యక్తులను గుర్తించే ప్రక్రియ వేగవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి ఆపోహలకు గురికావద్దని, అనుమానస్పద అంశాలను తక్షణమే పోలీసులకు తెలపాలని సీఐ కోరారు.