Devotional | భ‌క్తులతో యాదాద్రి కిట‌కిట‌

యాద‌గిరి గుట్ట‌, ఆంధ్ర‌ప్ర‌భ : వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులతో యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మి న‌ర‌సింహ స్వామి ఆల‌యం కిట‌కిట‌లాడుతోంది. ఆదివారం వేకువ జాము నుంచే ఆలయ ఈవో వెంకట్రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తెల‌వారు జాము నాలుగు గంటల నుండే దేవాలయంలో మాడ వీధులు, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

పరిశుభ్రత పనులన్నియు ఉదయము 4.30 గంటల లోపు తప్పని సరిగా పూర్తి చేయాల‌ని అధికారులను ఆదేశించారు. శ్రీ స్వామి వారి అభిషేకంలో పాల్గొన్న భక్తులతో మాట్లాడి దేవస్థాన వసతి , పలు సౌక‌ర్యాల‌పై వివ‌రాలు తెలుసుకున్నారు.

Leave a Reply