రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

గట్టుప్పల, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మండల కేంద్రంలో అరైవ్-ఆలైవ్ నినాదంతో “జీరో ఎన్ఫోర్స్మెంట్ డే” కార్యక్రమంలో భాగంగా 6వ రోజు ఎస్ఐ సంజీవరెడ్డి మరియు పోలీసులతో కలిసి విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రోడ్డు భద్రతపై ప్రజలకు సూచనలు చేస్తూ,ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా హెల్మెట్ వినియోగం,వాహన ఇన్సూరెన్స్,డ్రైవింగ్ లైసెన్స్,ఓవర్ స్పీడు,మైనర్లకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు ఇవ్వరాదని వివరించారు.

ఇదే సందర్భంలో ఎండాకాలం నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు ఆరుబయట నిద్రించడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని,అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.అలాగే మొబైల్ ఫోన్ యాప్‌ల ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తెలియని లింకులు,సందేశాలను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు చేశారు.కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పాష,సుదర్శన్ స్వరూప్ సింగ్,నందిని పాల్గొన్నారు.

Leave a Reply