కమ్మర్‌పల్లి జీపీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

కమ్మర్‌పల్లి జీపీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ హారిక అశోక్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సర్పంచ్ హారిక మాట్లాడుతూ.. ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా రూపుదిద్దుకుందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, పరిపాలనా రంగాల్లో కొత్త రాష్ట్రం విశేష పురోగతి సాధించిందని కొనియాడారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సర్పంచ్ హారిక పేర్కొన్నారు.

అనంతరం బదిలీపై వచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్‌ను సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, వార్డు సభ్యులు లోలం సురేష్, బోల్గాం నవీన్, కాలూరి మహేందర్, సున్నం కవిత, మాధవేణి లావణ్య, మామిడి లక్ష్మీ, వేములవాడ జగదీష్, మామిడి అక్షయ్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ రమ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కమ్మర్‌పల్లి జీపీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Leave a Reply