ఎమ్మెల్యే బొండా ఉమాను కలసిన సత్తెనపల్లి ఎమ్మెల్యే

పాయకాపురం, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గాల అభివృద్ధి, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.