Babunagar House Blast | కుటుంబం సురక్షితం.. ఇల్లు శిథిలం
Babunagar House Blast | కుటుంబం సురక్షితం.. ఇల్లు శిథిలం
తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
Babunagar House Blast | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాబూనగర్లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ నివాసంలో జరిగిన ఈ పేలుడుతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాదం సంభవించిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడకపోవడంతో పెను విషాదం తప్పింది. ఇంట్లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు పేలకపోవడం మరింత పెద్ద ప్రమాదాన్ని నివారించినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
