దైవదర్శనంలో ఎమ్మెల్యే…

దైవదర్శనంలో ఎమ్మెల్యే…

గ్రామ ఆలయంలో ప్రత్యేక పూజలు

కంచికచర్ల, ఆంధ్రప్రభ : కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించబడిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం సందర్శించారు.

ఈ సందర్భంగా కూటమి నేతలు, గ్రామ పెద్దలు, భక్తులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే సౌమ్యకు ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నందిగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ప్రజల ఆశీస్సులు, దైవానుగ్రహంతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Leave a Reply