మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

మునుగోడు, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని ఊకొండి గ్రామానికి చెందిన గురజాల బుచ్చయ్య కుమారుడు రాజశేఖర్ అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబానికి గ్రామ ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. సర్పంచ్ పోలగోని విజయలక్ష్మి సైదులు గౌడ్ 50 కేజీల బియ్యం, ఉపసర్పంచ్ కట్లకుంట మల్లేష్ 25 కేజీల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ చందపాక రామకృష్ణ,బోయపల్లి గిరి,బొడ్డుపల్లి లింగయ్య, బోయపల్లి యాదయ్య, చందపాక అనిల్, చందపాక అశోక్, బొడ్డుపల్లి శ్రీశైలం, ఏర్పుల మహేష్, గురుజాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply