Attack | ఎమ్మెల్యే బాలరాజుపై దాడికి యత్నం
Attack | ఎమ్మెల్యే బాలరాజుపై దాడికి యత్నం
Attack | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయం వద్ద ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూనం వంశీ అనే వ్యక్తి ఎమ్మెల్యేపై దాడికి యత్నించినట్లు సమాచారం.
క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న వంశీ, అనుచరుల సమక్షంలో ఎమ్మెల్యే బాలరాజుతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై ఎమ్మెల్యే గన్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. దాడి యత్నానికి గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
