TG | ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాం.. ఏసీపీ శ్రీనివాస్

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సీహెచ్.శ్రీనివాస్ తెలియజేశారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల‌ను ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ అనిల్ కుమార్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉందని రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.

రవాణా శాఖ నిబంధనలను వాహనదారులు తప్పకుండా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదన్నారు. తరచూ వాహనాల తనిఖీ నిర్వహిస్తామని, బ్రీత్ అనలైజర్ల ద్వారా డ్రంకన్ డ్రైవ్ టెస్టింగ్ నిర్వహిస్తామన్నారు.

Leave a Reply