రాయలసీమ రాయల్ విజయం

రాయలసీమ రాయల్ విజయం

అభిషేక్ సెంచరీ వృధా
మిడిలాడరు అద్భుత బ్యాటింగ్ తో రాయలసీమ అద్భుత విజయం
ఈ గెలుపుతో సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసిన రాయలసీమ

కడప, ఆంధ్రప్రభ : ఏపీఎల్ 2026 సీజన్ 5 కడపలో రెండవ రోజు తొలి మ్యాచ్లో కాకినాడ కింగ్స్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్ల మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది తొలుతగా కాకినాడ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. తొలిగా బ్యాటింగ్ కు దిగిన కాకినాడ జట్టు ఓపెన్ ఇద్దరూ శుభారంభాన్ని అందించారు అటు పవర్ ప్లే లో మంచి ప్రదర్శన చేస్తూ 10 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి కాకినాడ జట్టు 93 పరుగులు చేసింది అటు మొదటినుంచి ఓపెనర్ అభిషేక్ ఫోర్లు సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడ్డాడు ఏకంగా 60 బంతుల్లోనే 112 పరుగులు చేశాడు ఇందులో 10 ఫోర్లు ఐదు సిక్సర్లు ఉన్నాయి అటు ఇన్నింగ్స్ చివరిలో లేకాజ్ రెడ్డి 17 బంతుల్లో 37 పరుగులు రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో చివరిలో మెరుపులు మెరూపించాడు దీంతో 20 ఓవర్లలో కాకినాడ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరును స్కోరుబోర్డు పై నమోదు చేసింది అటు రాయలసీమ బౌలర్లలో పార్థసారథి మరియు పురుషోత్తం గణేష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష చేదనతో బ్యాటింగ్కు దిగిన రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఓపెనర్లు ఇద్దరు త్వరగా నే అవుట్ అవ్వడంతో టీం కు మంచి స్టార్ట్ లభించలేదు దీంతో రెండో డౌన్ లో బ్యాటింగ్కు దిగిన జీఎస్పీ తేజ 43 బంతుల్లో 76 పరుగులు 6 ఫోర్లు 3 సిక్సర్లతో అద్భుత ఇన్నింగ్స్ తో చివరి వరకు ఆడి టీంకు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు అటు తేజ తో పాటు వై వాసు 14 బంతుల్లో 42 పరుగులు 2 ఫోర్లు 5 సిక్సర్లతో మెరుపులు మెరూపించాడు. మరొక బెటర్ వై తేజారెడ్డి 27 బంతుల్లో 41 పరుగులు 1ఫోర్ 3 సిక్సర్లు ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు 18.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది దీంతో ఈ సీజన్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ప్లేయర్ మ్యాచ్ గా జీఎస్పీ తేజ ఎంపికయ్యాడు.