AP | ఘటనాస్థలంలోనే…

AP | ఘటనాస్థలంలోనే…
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నల్లజర్ల మండలంలోని వీరవల్లి టోల్ ప్లాజా వద్ద కారు ప్రమాదానికి గురై ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి సూచిక బోర్డును బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
