ముందుకొచ్చిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ..

ఆంధ్రప్రభ, విజయవాడ : యువతకు ఎయిడ్స్ వ్యాధి రావడానికి గల కారణాలు, డ్రగ్స్ వినియోగించడం వలన కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, నగరంలోని ట్రాఫిక్ ను నియంత్రించడానికి అవసరమైన 100 బారికేడ్ల లను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ నీలకంఠ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ డా.మంజులా చేతుల మీదుగా గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ట్రాఫిక్ డి.సి.పి. షిరీన్ బేగం కు అందజేశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ డి.సి.పి.షిరీన్ బేగం మాట్లాడుతూ…… నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ట్రాఫిక్ నియంత్రణ కోసం 100 బారికేడ్ల లను వితరణ చేయడం శుభ పరిణామం అన్నారు.
వీటి వలన ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజలకు డ్రగ్స్ వలన కలిగే నష్టాల గురించి ఎయిడ్స్ నియంత్రణపై అవగాహ కలిగించే విధంగా తయారు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫీక్ ఏ.సి.పి.రామ చంద్ర రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
