విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి అవసరం…

  • ప్రతిభ చాటుకునేందుకు మంచి అవకాశాలు..
  • శాప్ చైర్మన్ రవి నాయుడు..
  • విజయవాడ లో గురుకుల్ ఒలింపిక్స్ 2025 ప్రారంభించిన శాప్ చైర్మన్ రవి నాయుడు…

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని శ్రీ స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గురుకుల్ ఒలింపిక్స్ 2025 కార్యక్రమాన్ని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్బంగా రవినాయుడు మాట్లాడుతూ, విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి ఈ మహోత్సవం ఒక అద్భుత వేదికగా నిలుస్తుందని తెలిపారు.

గురుకుల వ్యవస్థ విలువలు, నీతి–నిజాయితీలు, క్రమశిక్షణను ప్రతిబింబించేలా అన్ని క్రీడా పోటీలు అత్యంత శ్రద్ధతో, సవ్యంగా నిర్వహించబడుతున్నాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి శాప్ బోర్డు డైరెక్టర్ సంతోష్ కుమార్, శ్రీ స్వామి నారాయణ గురుకులం ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన స్వామీజీలు మంత్ర స్వరూప్ దాస్ జీ, కృష్ణమూర్తి దాస్ జీ, అలాగే యాజమాన్య సభ్యులు దినేష్, గౌతమ్ నాయుడు, అంతర్జాతీయ ఖో ఖో క్రీడాకారుడు శివారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply