Dharna | పీఎసీఎస్ ఉద్యోగుల ధర్నా

Dharna | మోపిదేవి, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన మోపిదేవి కేడీసీసీ బ్యాంకు బ్రాంచ్ ఎదుట ప్రాథమిక వ్యవసాయ పరిపర సంఘం ( పీఎసీఎస్)ఉద్యోగులు ధర్నా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జీవో నెంబర్ 36ను అమలు చేయాలని, 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను రెగ్యులర్(Regular) చేయాలని, 5 లక్షలు తక్కువ కాకుండా ఆరోగ్య భీమా కల్పించాలని, సంఘాల్లో పని చేసే ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే రిటర్మెంట్(retrement) వయసు 62 సంవత్సరాలుగా అమలు చేయాలని తెలిపారు. ఈనెల 6 వ తేదీన నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి విధులకు హాజరయ్యారు.

8వ తేదీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబి బ్రాంచ్ ఎదుట సహకార సంఘాలు ఉద్యోగులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 16వ తేదీ మంగళవారం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సహకార కార్యాలయాల(District Cooperative Offices) వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి వినతిపత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఈ నెల 22వ తేదీ సోమవారం రాష్ట్రంలో ఉన్న అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం వినతిపత్రం(petition) అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 29వ తేదీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్న ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించడం జరుగుతుందని తెలిపారు.

జనవరి 5వ తేదీ సోమవారం నుండి 26 జిల్లాలు పూర్తయ్యే వరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద గిరి నిరాహార దీక్షలు(Hunger strikes) చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సహకార సంఘాల ఉద్యోగస్తుల ఐక్యత వర్ధిల్లాలని, ఉద్యోగులందరూ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారని తెలిపారు. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ.. తమ డిమాండ్స్ ని పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొక్కిలిగడ్డ పిఎసిఎస్(Kokkiligadda PACS) కార్యదర్శి మునిపల్లి నాగ మునీంద్రరావు తెలిపారు. తమ సమస్యల కోసం పోరాడి సాధించి తీరుతామని నాగ మునేందర్రావు తెలిపారు.

Leave a Reply