అమరావతి : ఏపీ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) పార్కులను కూటమి ప్రభుత్వం రూ.350 కోట్లతో అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే 50 పార్కులను రూ.135.53 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచింది. మొత్తం 175 పార్కుల అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించనుంది. ఒక్కో పార్కుకు కనీసం రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్లను కేటాయించింది. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించనున్నాయి.
APలో రూ.350 కోట్లతో ఎం ఎస్ ఎం ఇ పార్కులు – టెండర్లు ఆహ్వానం
