Stock Market Today | స్వల్ప లాభాల్లో నిఫ్టీ.. స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్

Stock Market Today | స్వల్ప లాభాల్లో నిఫ్టీ.. స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్

Stock Market Today | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వారంలోని తొలి ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 24,067 వద్ద ట్రేడవుతుండగా, సెన్సెక్స్ 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 101.34 వద్ద కొనసాగుతుండగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.4 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. అమెరికా 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ 4.38 శాతంకు చేరింది.

గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.05 శాతం, నాస్‌డాక్ సూచీ 0.24 శాతం మేర క్షీణించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు పరిమిత హెచ్చుతగ్గులతో ట్రేడవుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.