ట్రాఫిక్ పోలీసులకు డీజీపీ గుడ్ న్యూస్

ట్రాఫిక్ పోలీసులకు డీజీపీ గుడ్ న్యూస్

గుంటూరు / ఆంధ్రప్రభ: ఏపీలో మండుతున్న ఎండల మధ్య విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సిబ్బంది సంక్షేమం కోసం రూ.48 లక్షల ప్రత్యేక నిధులను విడుదల చేశారు.

ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 3,192 మంది ట్రాఫిక్ పోలీసులకు యూవీ గాగుల్స్, వైట్ క్యాప్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, మాస్కులు అందించనున్నారు.

అవసరమైన సామగ్రి కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, ప్రతి యూనిట్‌కు తక్షణమే పంపిణీ చేయాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply