వెలగపూడి : మహా కుంభమేళ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగస్వామ్యులు కానున్నారు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి. ఈ నెల 17వ తేదీన ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు లోకేష్ దంపతులు.
మహా కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించనున్నారు.అనంతరం వారాణశీకి బయలుదేరి వెళ్లనున్నారు.
కాశీ క్షేత్రపాలకుడైన మహా కాలభైరవేశ్వరుడి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంటారు. విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. వారణాశి ఘాట్‌లను సందర్శించి, గంగా హారతిలో పాల్గొనే అవకాశం ఉంది.