accident | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం

accident | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం

accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కర్ణాటకలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లాడ్లాపూర్ సమీపంలో వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాడ్లాపూర్ సమీపంలో అతివేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం అదుపుతప్పి ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో క్యాష్వార్, హుస్సేన్, అలీ, రసూల్, ఫాతిమా అనే ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కుటుంబంలోని ఐదుగురు ఒకేసారి మృతిచెందడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Leave a Reply