రాప్తాడులో 25వ సిల్వర్ జూబ్లీ వేడుకలు

రాప్తాడులో 25వ సిల్వర్ జూబ్లీ వేడుకలు

రాప్తాడు, ఆంధ్రప్రభ: ఎన్నేళ్లయినా సరే తిరిగి మన పాఠశాల ఆవరణంలోకి అడుగుపెట్టగానే ఆనాటి జ్ఞాపకాలు ఆ చిలిపి పనులు ఆ నవ్వులు ఆ పరుగు పందాలు అన్నీ ఒకేసారి కళ్లముందు కదలాడుతున్నాయని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ను నిర్వహించారు.

1996-2001 వరకు 6 తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్న 70 మంది విద్యార్థిని విద్యార్థులు 25 వ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గౌరవంగా ఆహ్వానించి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడుతూ జీవితం అనే పరుగులో పడి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి ఒకరికొకరం దూరం అయ్యాము కానీ ఈరోజు ఇలా అందరం కలిసి మళ్లీ ఒకచోట చేరడం నిజంగా అదృష్టం అని అన్నారు.

మనం చదువుకున్న రోజుల్లో మనల్ని దిద్దిన గురువుల ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.అప్పట్లో టీచర్లు క్లాస్ చెబుతుంటే ఎప్పుడు పీరియడ్ అయిపోతుందా బయటకెళ్లి ఆడుకుందామా అని ఆలోచించేవాళ్లము.కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఆ క్లాస్‌రూమ్ కబుర్లే ఆ తిట్లు ఆ ప్రేమలే మన జీవితానికి పునాదులు. అది వందకు వంద పాళ్లు నిజం. మనం ఏ రంగంలో స్థిరపడినా ఏ హోదాలో ఉన్నా ఈ రోజు ఇక్కడ మాత్రం మనం కేవలం పాత స్నేహితులము మాత్రమే. ఆ బాధ్యతలు టెన్షన్లు అన్నీ పక్కన పెట్టి ఇవాళ పాత రోజుల్లోకి వెళ్ళిపోదాం. ఈ జ్ఞాపకాలను మనసులో దాచుకుని వచ్చే కాలానికి కొత్త ఉత్సాహంతో వెళ్దామన్నారు.

ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు తులసి నాగమణి ఆశీర్వాదం వెంకటేష్, వాసు, నాగేంద్ర, నల్లప్ప ప్రభాకర్, వీరభద్ర విద్యార్థిని విద్యార్థులు పాలచెర్ల వెంకటేశులు, లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, మురళి, గోపాల్, ముత్యాలమ్మ, అనిత, నాగేంద్రమ్మ, భారతి, లక్ష్మీనరసమ్మ, వన్నూరమ్మ, కవిత, రాంగోపాల్, వీరాంజనేయులు ,అయ్యవారిపల్లి మురళి ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply