దివ్యాంగ విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్

దివ్యాంగ విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్
ఘంటసాల, ఆంధ్రప్రభ: దివ్యాంగ విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఘంటసాల మండలం దేవరకోట గ్రామంలో సర్వే జరుగుతున్న విధానాన్ని సమగ్ర శిక్ష జిల్లా సహిత విద్య సమన్వయకర్త కల్లేపల్లి ఏడుకొండలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా దివ్యాంగ విద్యార్థులకు వచ్చే రాయితీల గురించి తెలిపారు. బడి ఈడు వయసు ఉన్న ప్రత్యేక అవసరాలు గల బాల, బాలికలను పాఠశాలలో ఎన్ రోల్ చేయాలని కోరారు. ఈ సర్వేలో ఐఈఆర్పి జి.శ్రీకాంత్ పాల్గొన్నారు.
