నాదెండ్ల భాస్కరరావుకి ప్రముఖుల నివాళులు

నాదెండ్ల భాస్కరరావుకి ప్రముఖుల నివాళులు

ఆంధ్రప్రభ , విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్ర పటానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. బుధవారం హైదరాబాద్ లోని నివాసంలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఆయన కుమారులు ఏపీ ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రినాదెండ్ల మనోహర్ ని పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply