జగ్గయ్యపేట – పెనుగంచిప్రోలు తిరుణాలలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలలో తెలుగుదేశం , జనసేన , వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. టీడీపీకి చెందిన ప్రభ సెంటర్లో ఉండగా, వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రభ వర్గం రెచ్చగొట్టే చర్యలకు దిగింది. వాటర్ ప్యాకెట్లు బాటిళ్లు రాళ్లు విసిరారు. ఇది గమనించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు వెళ్లారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపైనా రాళ్లు, వాటర్ ప్యాకెట్‌లు విసిరారు. ఈ ఘటనలో నలుగురు పోలీసు సిబ్బంది, ప్రజలకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. రెచ్చగొట్టేలా దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేశారు.
AP| తిరునాళ్ళలో పోలీసులపై వైసిపి కార్యకర్తల దాడి …
