AP | పారామెడికల్ కోర్సులకు రెండో విడత వెబ్ ఆప్షన్లు…

AP | పారామెడికల్ కోర్సులకు రెండో విడత వెబ్ ఆప్షన్లు…
- జనవరి 20 నుంచి 23వ తేదీ వరకే…
- విద్యా సంవత్సరం వృధా కాకుండా అడ్మిషన్లు…
AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్సరానికి గాను మిగిలిపోయిన బీ.ఎస్సి, పారామెడికల్, బీపీటీ, ఎంఎల్ టీ కోర్సుల అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్రంలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఈ రోజు శుభవార్త అందించారు. రాష్ట్రంలోని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విద్యార్థి తల్లిదండ్రుల నిరంతర కృషి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ హెల్త్ యూనివర్సిటీ స్పందించి ఈ రోజు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈనెల 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభిస్తున్నారు. ఈనెల 23వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఈ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం మొత్తం 8,709 మంది అభ్యర్థులతో ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను యూనివర్సిటీ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న రీజియన్ల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచమని ఆ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.
