AP | ఇంకా వదలని పొగమంచు

AP | ఇంకా వదలని పొగమంచు
AP | నాగాయలంక, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ వెళ్లినా రాత్రి పూట చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. దానితో పాటు ఉదయం నుంచి 10గంటల వరకు పొగ మంచు వీడటంలేదు. ప్రధాన రహదారులలో పొగ మంచు దట్టంగా పట్టడంతో నాగాయలంక మండలంలో వాహనదారులకు ముందు వచ్చే వాహనాలు గుర్తు తెలియక తికమక పడుతున్నారు. గృహస్థులు కూడా ఊరిలో మంచు పొగలా విస్తరించటంతో బైట ముఖం చూడటం లేదు. ఉదయం పూట పలు పనులకు తరలి వెళ్లుతున్న కార్మికులు పొగమంచు బారిన పడుతున్నారు.సంక్రాంతి వెళ్లగానే మంచు తగ్గుతుందని రైతులు ఆశించారు. పూత దశలో మినుము పైరుకు పొగ మంచు ఏ హాని చేస్తుందో నని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
