Gudivada | సావిత్రిబాయి పూలే జయంతి..

Gudivada | సావిత్రిబాయి పూలే జయంతి..
Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా స్థానిక జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహం దగ్గర కృష్ణాజిల్లా, గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడుతూ కుల, మతాలకతీతంగా అందరం కూడా వాళ్ళ బాటలో పయనిద్దామని వారిని ఆదర్శంగా తీసుకొని మెరుగైన సమాజం నిర్మిద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పిల్లి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు పి.వీరభద్రరావు, మాజీ టౌన్ ప్రెసిడెంట్ కావేటి కనకదుర్గ ప్రసాద్, అంకమ్మరావు, ముక్కపాటి సాయి, స్వాతి, నాగ దుర్గ కుమారి, రాధా కుమారి, గడ్డం జయలక్ష్మి, సాయి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలే అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
