ట్రస్ట్ సేవలు అభినందనీయం..

ట్రస్ట్ సేవలు అభినందనీయం..

ఎంపీ కేశినేని శివనాద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విజయవాడ, ఆంధ్రప్రభ : కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ( చిన్ని), తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పడమటలోని హై స్కూల్ రోడ్డు రైతు బజార్ వద్ద ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో 11వ డివిజన్ శానిటరీ కార్మికులకు నూతన వస్త్రాలు, చెత్త సేకరణ తోపుడు బండి, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని ) మాట్లాడుతూ… కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో సైతం ట్రస్ట్ భాగస్వామిగా ఉండటం అభినందనీయమన్నారు. ట్రస్ట్ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన శానిటరీ కార్మికులకు నూతన వస్త్రాలు అందజేసి సత్కరించుకోవడం సంతోషకరమన్నారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. సమాజ సేవ తత్పరత ఉన్న కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. రూ . 50,000 వ్యయంతో డివిజన్ శానిటరీ కార్మికులకు ఉపయోగపడే ఒక ప్లాట్ఫారం రిక్షా, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఈ సందర్భంగా పంపిణీ చేశారు.

మేనేజింగ్ ట్రస్ట్రీ కోనేరు వెంకట రమేష్, సభ్యులు నాయిని ఝాన్సీ రాణి, కొల్లిపర రాజ్యలక్ష్మి, కోనేరు రాజేష్, కోనేరు రూపేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, పొట్లూరి సాయిబాబు, ముమ్మినేని వెంకటప్రసాద్, 11వ డివిజన్ టిడిపి అధ్యక్షులు నాదెళ్ల రాజేష్, సీనియర్ నాయకులు జాస్తి సురేష్, పాలడుగు ప్రసాద్, దేవరపల్లి ఆంజనేయులు, పామర్తి కిషోర్, పట్నాల సదాశివరావు, కొనసాని నాగమణి, రొయ్యూరు శ్రీనివాస్, కలగర్ర మాధవి, మునగాల చిన్న పిచ్చయ్య, యలమంచిలి సత్య వరప్రసాద్, బంగారు మురళీకృష్ణ లతో పాటుగా తోపుడు బండ్లు అందుకున్న చిరు వ్యాపారులు ఆకుల దుర్గ, గుడివాడ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply