AP | జనవాణిలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

AP | జనవాణిలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
AP | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం “జనసేన – జనవాణి” కార్యక్రమం జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని పార్టీ ద్వారా ప్రభుత్వ సహకారంతో పరిష్కారం చేయడమే ధ్యేయంగా జనసేన -జనవాణి కార్యక్రమం క్రమంతప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
