చెన్నూరులో జిల్లాస్థాయి అత్య పాత్య క్రీడాకారుల ఎంపిక
చెన్నూర్ , ఆంధ్రప్రభ : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ అత్యపాత్య క్రీడాకారుల ఎంపిక జిల్లా అత్య పాత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సత్తయ్య ప్రారంభించారు. ఈఎంపిక పోటీలకు జిల్లాలోని 80మంది బాల బాలికలు క్రీడాల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో క్రీడాకారులు ఈ నెల 9,10 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటిల్లో పాల్గొంటరని అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ గాంధర్ల సంతోష్, జాయింట్ సెక్రటరీ విశాల తెలిపారు. ఈ కార్యక్రమంలో కనపర్తి రమేష్, రిటైర్డ్ వ్యాయమ ఉపాధ్యాయులు కరెంగుల రామయ్య తదితరులు పాల్గొన్నారు.
