Gold rates | గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ పైపైకి..

Gold rates | గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ పైపైకి..
- ఒక్క రోజే రూ.6వేలు పెరిగిన బంగారం
- వెండిది అదే దారి.. రూ.14 వేలు పెరుగుదల
- సామాన్యులు, మధ్య తరగతి బెంబేలు

Gold rates |వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటుండగా.. మళ్లీ వాటి రేట్లు పెరిగాయి. కేంద్ర బడ్జెట్ 2026 తర్వాత దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా పతనమయ్యాయి. నిన్న, ఇవాళ రేట్లు పెరిగాయి. ఈ రోజు బంగారం ధర రూ.6వేలు పెరిగి రూ.1.60 వేలు దాటింది. అలాగే వెండి కిలో ధర రూ.14 వేలు పెరిగి రూ.2,93,900కు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో గోల్డ్ , సిల్వర్ ధరలు మళ్లీ పెరుగుతుండటంతో సామాన్యులు, మధ్య తరగతి వారు బెంబేలెత్తుతున్నారు. ధరలు ఇలా పెరిగితే ఎలా కొంటాం.. శుభ కార్యాలు ఎలా జరిపిస్తామని ఆందోళన చెందుతున్నారు.

ఈ రోజు ఉదయం గం.11.30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,64,400 పలికింది. నిన్నటి రూ.1,58,500తో పోలిస్తే దాదాపు రూ.6 వేలు పెరిగింది. అలాగే నిన్న రూ.2,79,600 వద్ద ముగిసిన వెండి ఈరోజు రూ.14 వేలు పెరిగి రూ.2,93,900కు చేరుకుంది.
