AP | వ‌ల్ల‌భ‌నేని వంశీకి ‘నానీ’ ల ప‌ల‌క‌రింత

విజ‌య‌వాడ : రాష్ట్ర రాజకీయాల్లో ఆప్త మిత్రులుగా పేరొందిన మాజీ మంత్రులు కొడాలి నాని (Kodali Nani), పేర్ని నాని (Perni Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) శనివారం ఉంగుటూరు మండలం తెలప్రోలు (Telaprolu) లో శనివారం సాయంత్రం కలుసుకున్నారు. ఈసందర్భంగా ముగ్గురు నాయకులు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు. వివిధ కేసుల్లో వంశీ బెయిల్ పై విడుదలైన తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని తొలిసారి కలుసుకున్నారు.

ముగ్గురు నాయకులు (Three leaders) సుధీర్ఘంగా పలు అంశాలపై మాట్లాడుకున్నారు. పేర్ని నాని వేసిన జోకులకు అక్కడున్న నాయకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. రాజకీయాల్లో లెజెండ్స్ అయినా ముగ్గురు నేతల భేటీతో కృష్ణా జిల్లా వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో అక్రమ అరెస్టు అయ్యి బెయిల్ పై విడుదలైన వంశీ సన్నిహితులను కొడాలి నాని పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, కృష్ణాజిల్లా యువజన విభాగ అధ్యక్షులు మెరుగు మాల కాళీ, నందివాడ మండలం ఎంపీపీ పెయ్యల ఆదాం, గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడపా హర్ష, సింహాద్రి రాంబాబు, చుండూరు శేఖర్, కందుల నాగరాజు, పుల్లేటికుర్తి కృష్ణా రావు, పాలడుగు రాంప్రసాద్, యార్లగడ్డ సత్య భూషణ్, కసుకుర్తి బాబ్జి, గన్నవరం, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply