అనుభవంతో మరింత అభివృద్ధి చేస్తాను
ఐదో వార్డుబోదిరే లావణ్య ( బోదిరే నర్సయ్య )
భీమ్‌గల్ టౌన్, ఫిబ్రవరి 3 ( ఆంధ్రప్రభ ) కౌన్సిలర్ గా ఉన్న అనుభవం తో వార్డు ను మరింత అభివృద్ధి చేస్తానని మరో సారి అవకాశం ఇవ్వాలని బోదిరే లావణ్య ( బోదిరే నర్సయ్య ) కోరారు. బుధవారం ఐదో వార్డు లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. వార్డు లో మహిళలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు.
మరో సారి విజయం అందిస్తే వార్డు లో మిగిలిన సమస్యలు సాల్వ్ చేస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, మరో మారు మోసపోవద్దని కోరారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు.
