Summer Temperatures | వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక

Summer Temperatures | వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక

Summer Temperatures | కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు
తణుకులో 44.8 డిగ్రీల నమోదు
15 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా రికార్డు
మరో ఐదురోజులు భగభగలే..

Summer Temperatures | అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నిప్పుల వాన కురుస్తోంది. అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకావడంతో అగ్ని గుండంగా మారుతోంది. ఉదయం 9 గంటలకే కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలుగా నమోదవుతుండడంతో ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో గత పదేళ్లల్లో లేనివిధంగా పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48.1 డిగ్రీలు నమోదైన విషయం విదితమే. అయితే శుక్రవారం కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 44.8 డిగ్రీలు నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ Prakhar Jain తెలిపారు.

ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా శుక్రవారం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 15 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.

శుక్రవారం ఏలూరు జిల్లా కలపర్రు, కృష్ణా జిల్లా కానుమోలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.8, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 43, కోనసీమ జిల్లా శివల, గుంటూరు జిల్లా తాడేపల్లి, కాకినాడ జిల్లా కాజులూరు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.8, మన్యం జిల్లా సాలూరులో 42.4, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో 42.3, విశాఖ రూరల్‌లో 42.1, చిత్తూరు జిల్లా నగరిలో 42 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Leave a Reply