Cyclone | తుఫాను షెల్టర్లు..
Cyclone | తుఫాను షెల్టర్లు..
Cyclone, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సముద్ర, కృష్ణా నదీ తీరాల్లో తరచూ సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు తుపాను రక్షిత భననాలు నిర్మించాలని ఎంపీ బాలశౌరి (Mp Balasouri) సోమవారం లోక్ సభలో ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మాట్లాడుతూ… ‘1977 దివిసీమ ఉప్పెనతో కృష్ణా డెల్టా తీవ్రంగా దెబ్బతింది. వేలల్లో ప్రాణ నష్టం, రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ప్రజల రక్షణ కోసం అప్పట్లో పెద్దఎత్తున తుపాను షెల్టర్లు నిర్మించారు.
అవన్నీ 40 ఏళ్ల కిందటివి కావడంతో దాదాపు అన్నీ శిథిలావస్థకు చేరాయి. ప్రకృతి విపత్తులు సంభవిస్తే.. తీర ప్రాంత ప్రజల రక్షణకు ఎంతగానో ఉపయోగపడే తుఫాను రక్షిత భవనాలు నిర్మించాలని, ఇవి విపత్తుల సమయంలో రక్షిత భవనాలుగా.. సాధారణ సమయాల్లో సామాజిక కార్యక్రమాలు, డ్వాక్రా మహిళల శిక్షణ కార్యక్రమాలకు ఉపయోపడతాయని ఎంపీ బాలశౌరి అభిప్రాయం వ్యక్తం చేశారు.
