రాష్ట్రస్థాయి పూటీ లాగుడు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభం..
రాష్ట్రస్థాయి పూటీ లాగుడు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభం..
కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరులో రాష్ట్రస్థాయి పూటీ లాగుడు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలకు అవనిగడ్డ సీఐ యువకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కోడూరు శివారు స్వతంత్ర పురం నందు పసుపులేటి రాము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలలో ముందుగా న్యూ జూనియర్ విభాగం పూటీ లాగుడు ప్రదర్శన ప్రారంభంమైనది.
ఈ కార్యక్రమంలో కోడూరు మండల కూటమి నాయకులు బండే శ్రీనివాసరావు, మర్రె గంగయ్య, కోడూరు ఎస్ఐ చాణిక్య గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
