ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమే: బీఎస్పీ పార్టీ

ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమే: బీఎస్పీ పార్టీ
బీఎస్పీ రిలే నిరాహార దీక్షలు
అనంతపురం, ఆంధ్రప్రభ : సీనియర్ జర్నలిస్టు కొత్తూరు లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అనంతపురం జిల్లా కమిటీ ప్రకటించింది.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు మాట్లాడుతూ, గీతం కాలేజీ చైర్మన్ మనీషా నాయక్ సహా ఇతర నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఇది పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఈ నిర్లక్ష్యానికి నిరసనగా అనంతపురంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. రాయదుర్గం, కొండాపురం ప్రాంతాల నుంచి సుమారు 30 మంది యువ నాయకులు దీక్షకు మద్దతుగా పాల్గొన్నారు.
నిందితులను వెంటనే అరెస్టు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమని బీఎస్పీ జిల్లా కమిటీ హెచ్చరించింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
