బండి భగీరత్ ను వెంటనే అరెస్టు చేయాలి…

వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలోమంగళవారం విలేకర్లు సమావేశం ఏర్పాటు చేసి ఈసమావేశంలో బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు సామ ప్రతాప్, సీనియర్ నాయకుడు రేగుల్ల రాములు మాట్లాడుతూ పిఓసిఎస్ఓ కేసులో 24 గంటల్లో అరెస్ట్ చేయాలని నిబంధనలు ఉన్నా విచారణ చేయమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం విడ్డూరం విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

మూడు రోజులనుండి దేశం అంతా మారుమోగుతున్న ఘటన గురించి తనకు తెలియదు అన్నట్లు,ఎందుకు విచారణ చేయలేదని డీజీపీని అడగడం ఇవన్నీ ప్రజలు అమాయకులు అన్నట్లుగా ఉందని ఆరోపించారు.పిఓసిఎస్ఓ నిందితుడి అయితే 24 గంటల్లోపు అరెస్ట్ చేయాలి, లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవన్నీ చేయకుండా పోలీసులు తాత్సారం చేయడం కూడా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అనే విషయం రేవంత్ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.ఈ విచారణ ఆదేశించిన ఒక రోజు ముందే ముద్దాయి తండ్రి, బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ ని తన ప్రియ మిత్రుడుగా అభివర్ణించడం ఏమిటని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సూచించారు.ఈ కార్యక్రమంలో వేల్పూర్ బిఆర్ఎస్ టౌన్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు..

Leave a Reply