after1996 | కొళత్తూరులో టీవీకే విజయం
after1996 | కొళత్తూరులో టీవీకే విజయం
after1996 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు భారీ మెజారిటీతో విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌ను టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు సుమారు 9,000 ఓట్ల తేడాతో ఓడించినట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. వీఎస్ బాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఎంకే నుంచి టీవీకేలో చేరినట్లు సమాచారం. 1996 తర్వాత స్టాలిన్ తొలిసారి ఓటమి చవిచూడడం గమనార్హం. ఈ ఫలితం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా, మొత్తం ఫలితాల్లో టీవీకే పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
