మండల అభివృద్ధికి అందరూ సహకరించాలి

సిర్పూర్ (యు) నూతన ఎంపీడీవోను సన్మానించిన సర్పంచులు

సిర్పూర్ (యు),ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) నూతన ఎంపీడీవోగా ఎం. రవీందర్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇచ్చోడలో సూపరింటెండెంట్‌గా పనిచేసి పదోన్నతిపై సిర్పూర్ (యు) మండలానికి వచ్చినట్లు తెలిపారు.

నూతన బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోకు సర్పంచులు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. సన్మానం చేసిన వారిలో సిర్పూర్ (యు) సర్పంచ్ ఆత్రం ఓం ప్రకాష్, పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా, సర్పంచులు గణపత్ రావు, సెడంకి జానే రావు, మెస్రం స్పందన భూపతి, మడావి లక్ష్మణ్ పాల్గొన్నారు.