36 రకాల సన్నాలకు బోనస్ ప్రకటించాలి: బీజేపీ డిమాండ్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: రైతు సమస్యలను విస్మరించి వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ ఓబీసి మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆద్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ ఏఓ ప్రకాష్ కి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంధ్యారాణి, పల్లె సదానందం మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల ఋణ మాఫీ చేస్తామని ఆంక్షలతో రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో ప్రతి పంటకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు బోనస్ ఎగ్గెట్టేందుకు సన్నాలలో 36 రకాలకు కేవలం 7 రకాలకే పరిమితం చేసిందన్నారు. 36 రకాల సన్నాలకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లాలో సాగు చేస్తున్న 1224 రకం సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకొని బోనస్ ప్రకటించాలని, రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలువేరు ఓదెలు, భూషణవేణ శ్రీనివాస్ గౌడ్, ఎర్రోళ్ల రాములు, కొమ్ము తిరుపతి, శనిగరపు రమేష్, గర్రెపల్లి నారాయణ స్వామి, కంకణాల జ్యోతిబసు, మోర మనోహర్, రాజేంద్ర ప్రసాద్, కొమెరిశెట్టి రమేష్, ప్రమోద్, ముస్త్యాల సంతోష్, ఫహీమ్, ఉనుకొండ తిరుపతి, కోల సుధాకర్, బండ కరుణాకర్, జెట్టి రాజు, నక్క శ్రీనివాస్, గొట్టిముక్కుల శ్రీనివాస్, మంథని కృష్ణ, విజయ్, కావేటి రాజగోపాల్, ఎల్లంకి రాజు, సదయ్య, ఇరుగురాల బానుచందర్, కొప్పుల శ్రీనివాస్, బొల్లం అనిల్, పెరక పల్లవి, నూనెటి వెంకటేష్, మిట్టపల్లి వెంకటేశం, మల్లారెడ్డి, మేరుగు శ్రీనివాస్, బొంకురి సాగర్, కడిక్యల నితిన్, గండు అనిల్, తదితరులు పాల్గొన్నారు.
