Gulzar House Fire Accident | ప్రధాని మోడీ దిగ్ర్భాంతి.. మృతులకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా

ఢిల్లీ : చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు.

ఇవాళ‌ తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో స్పాట్ లో ముగ్గురు మరణించగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో 14మంది మరణించారు. మృతుల సంఖ్య 17కి చేరుకోగా.. మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు సహా.. ముగ్గురు చిన్నారులున్నారు. మృతుల్లో అత్యధికంగా బెంగాల్ వాసులు ఉండగా.. హైదరాబాద్ లో బంధువుల ఇళ్లకు వచ్చి ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది.

Leave a Reply