Twit | ప్రజాపాలనలో ప్రగతి అధోగతి – కేటిఆర్ విమర్శ

హైదరాబాద్ – ప్రజాపాలనలో ప్రగతి అధోగతిగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సాగునీళ్లు ఆగిపోయాయని.. వ్యవసాయం ఆగమైందని పేర్కొన్నారు

కాంగ్రెస్‌ పాలనలో పచ్చని పొలాలు మాయమైపోయాయని కేటీఆర్‌ అన్నారు. పంట చేలు పశువులకు మేతగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల కేసీఆర్‌ పాలనలో మాయమైన బోరు బండ్లు.. 15 నెలల కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన మూలంగా గ్రామాల్లో సాగునీటి కోసం మళ్లీ బోరు బండ్లు ప్రత్యక్షమయ్యాయని అన్నారు.

కేసీఆర్‌ పాలనలో మిషన్ భగీరథతో ఇంటింటికి అందిన తాగునీళ్లు.. నేడు మళ్లీ తాగునీటి కోసం బోర్లు, బావులు, ట్యాంకర్లను ఆడబిడ్డలు ఆశ్రయిస్తున్నారని చెప్పారు. నాడు ఎండాకాలంలో మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు.. నేడు రైతన్నలపై కక్షగట్టిన కాంగ్రెస్ పాలనలో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు వట్టిపోయాయని, పంటచేలు ఎండుతున్నాయని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు అని మండిపడ్డారు.

Leave a Reply