అర్హులకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం..

కడెం, ఆంధ్రప్రభ : రాజకీయాలు, పార్టీల అనుబంధాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ధ్యేయమని బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్ల వెంకటేష్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చెన్ను మల్లేష్ యాదవ్ లు పేర్కొన్నారు. శుక్రవారం కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామంలో విలక్షణమైన, హుందాతనంతో కూడిన కార్యక్రమం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీజేపీ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ ఎల్తపు అనూష భర్త శ్రీనివాస్‌కు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న, డిసిసి మెంబర్ గొల్ల వెంకటేష్ అందజేశారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పంచతి శ్రీనివాస్ యాదవ్ నాయకులు శ్రీనివాస్ కమటాల రవి గిరవేణి సత్తన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలందరూ ఒక్కటేనని, సంక్షేమ పథకాల పంపిణీలో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేదని వారు స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అయినప్పటికీ, ప్రజా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఈ సహాయాన్ని అందించడం జరిగిందని వారు తెలిపారు. అర్హులకు సకాలంలో ప్రభుత్వ సాయం చేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని వారు పేర్కొన్నారు.