బాసరలొ మైసూర్ అవధూత దత్తపీఠ ఉత్తరాధికారి
బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని శుక్రవారం శ్రీ దత్త విజయానంమైసూర్ అవధూత దత్తపీఠ ఉత్తరాధికారి తీర్థ స్వామీజీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ దత్త విజయానంమైసూర్ అవధూత దత్తపీఠ ఉత్తరాధికారి తీర్థ స్వామీజీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలను స్వామీజీకి ఆలయ ఈఓ అంజనీ దేవి, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి వివరించారు. వీరి వెంట ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు ఉన్నారు.
