Acid | బీసీ హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం…
Acid | బీసీ హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం…
- యాసిడ్ సేవించిన విద్యార్థిని…
- పరిస్థితి విషమం…
- స్పత్రి ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన…
Acid | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ డీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న ఎర్రబోయిన హిమశ్రీ (19) అనే విద్యార్థిని ఈ రోజు యాసిడ్(Acid) తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనుముల మండలం హజారి గూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ దంపతుల పెద్ద కుమార్తె హిమశ్రీ నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న బీసీ హాస్టల్ లో ఉంటూ ఎన్జీ కళాశాలలో డీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ రోజు తెల్లవారుజామున బాలిక హాస్టల్(girls’ hostel) ఆవరణలో ఉన్న బాత్రూంలు కడిగే యాసిడ్ ను సేవించి రూమ్ లోకి వచ్చి వాంతులు చేసుకుంది. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని వెంటనే వార్డెన్ జ్యోతి దృష్టికి తీసుకెళ్లి చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో వార్డెన్ జ్యోతి బాలికను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి(private hospital)కి తరలించింది. విషయం తెలిసిన వెంటనే డిబిసిడబ్ల్యుఓ సంజీవయ్యతోపాటు పలువురు అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని నాలుగు రోజుల తర్వాత కానీ ఏమి చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువు విద్యార్థి సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
