బాలుడు అదృశ్యం.. కేసు నమోదు

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన టేకు సతీష్ కుమారుడు టేకు కృష్ణ ప్రసాద్ (15) గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైనట్లు కమ్మర్‌పల్లి ఎస్సై సీహెచ్. సతీష్ తెలిపారు.

ఎస్సై వివరాల ప్రకారం, కృష్ణ ప్రసాద్ లేత ఆకుపచ్చ రంగు టీ-షర్టు, జీన్స్ ప్యాంటు ధరించి ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. అనంతరం అతని ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

దీంతో బాలుడి తల్లి కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు.

బాలుడు ఎక్కడైనా కనిపించినా లేదా అతని గురించి సమాచారం తెలిసినా వెంటనే కమ్మర్‌పల్లి ఎస్సై 8712659868 లేదా బాలుడి తండ్రి సతీష్ 8328644754 నంబర్లకు, లేక సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.